బీఆర్ఎస్ హయాంలో.. లీకులు, స్కాములే..: పీసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో.. లీకులు, స్కాములే..: పీసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: పరీక్ష పత్రాల లీకులు అన్ని రంగాల్లో కుంభకోణాలు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 2019లో ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చేసుకున్నా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. అంతేకాకుండా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల పరీక్షా పత్రాలు లీకై కోట్ల రూపాయల దందా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కార్యదర్శులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ హాత్ సే హాత్ జోడో పాదయాత్రను 24వ తేదీన జనగామ పట్టణంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలోబీజనగామ పట్టణ నాయకులు మోటె శ్రీనివాస్, జాయ మల్లేశం, ఆలేటి సిద్ధిరాములు , సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల్ల సిద్ధారెడ్డి, డీసీసీ కార్యదర్శి నరసింహారెడ్డి, పిక్క బీరప్ప, బోరెల్లి సిద్ధులు, భోగారం దయాకర్ రెడ్డి, మోటె లింగయ్య, బొట్ల నర్సింగరావు, మచ్చ ప్రవీణ్,గంధమల్ల కమలాకర్, డానియల్ , ప్రభాకర్ , ధర్మ గోవర్ధన్ రెడ్డి , సర్వల నర్సింగరావు, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, వగలబొయిన యాదగిరి, లింగాల నర్సిరెడ్డి,  దేవులపల్లి నారాయణ, సూదగాని కృష్ణ కుర్రంల రవికుమార్,  నామాల భిక్షపతి, ముచ్చల రాజిరెడ్డి పాల్గొన్నారు.