రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అదనపు కలెక్టర్ బి ఎస్ లత

రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ  అదనపు కలెక్టర్ బి ఎస్ లత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పోరాటపటిమగలిగిన నాయకురాలు, నిజాం రాజులకు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ అని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు.  కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన చాకలి ఐలమ్మ 38 వ వర్ధంతి  కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత సంబంధిత అధికారులతో కలిసి  పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి  పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆడిషన్ కలెక్టర్  మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం,భుక్తి కోసం,దోపిడీ,పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను చాకలి ఐలమ్మ గడగడలాడించింది. చాలా ధైర్యవంతురాలు  ఒక బీద  పేద మహిళ ఆమె పోరాట పటిమకు మహిళలకు గొప్ప గౌరవం దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహనీయుల జయంతులు వర్ధంతిలు, ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు .

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సాయిబాబా  పిడి డిఆర్డిఏ నరేష్, హౌసింగ్ రాజేశ్వర్, డి డబ్ల్యు ఓ నరేష్ , సాంస్కృతిక సారథి కోఆర్డినేటర్ పరుశురాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.