మహిళ లోకానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకం జగిత్యాల ఎమ్మెల్యే డా.  సంజయ్ కుమార్

మహిళ లోకానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకం  జగిత్యాల ఎమ్మెల్యే డా.  సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళా లోకానికి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ అని సామాజిక ఆధునిక పరిణామానికి నాందిపలికిన స్త్రీ ధైర్యశాలి అన్నారు. తెలంగాణ తెగువకు చిరునామా మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోల్ శ్రీనివాస్, రజక సంఘం సభ్యులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.