హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లా పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో దసరా బోనస్ చెక్ లను అందజేశారు.
పౌర సరఫరాల సంస్థలోని మూడు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో  పనిచేసే 79 మంది హమాలీలకు, ముగ్గురు స్వీపర్లకు  మొత్తం 82 మందికి ఒక్కొక్కరికి 6 వేల 500 రూపాయలు చొప్పున దసరా బోనస్ చెక్ లను అదనపు కలెక్టర్ అందించారు. అలాగే ప్రతి ఒక్క హమాలీకు, స్వీపర్లకు 800 రూపాయలు స్వీట్స్ కొరకు అందజేసీ, హమాలీలకు, స్వీపర్లకు అదనపు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 30 లోపు సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి...

ప్రభుత్వం నిర్దేశించిన గడువు నవంబర్ 30 లోగా సిఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో శ్యాం ప్రసాద్ లాల్  సీఎంఆర్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  రైస్ మిల్లర్లు సకాలంలో ఖరీఫ్ 2022-23 కు సంబంధించి సిఎంఆర్ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ రైస్ బాకీ ఉన్న మిల్లర్లు నవంబర్ 30లోగా తప్పని సరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు చేరుకోని రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.  రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి, రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సి.ఎం.ఆర్. రైస్ డెలివరీ చేయాలనీ, వానాకాలం పంటకు సంబంధించిన  పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

సీఎంఆర్ రైస్ డెలివరీ బాకీ ఉన్న మిల్లులకు ఖరీఫ్ 2023-24  సీజన్ ధాన్యం కేటాయించ డం జరగదని, సిఎంఆర్ రైస్ ఎక్కువగా బాకీ ఉన్న మొదటి 10  మిల్లర్లు  గడువులోగా డెలివరీ చేయకుంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈ  సమావేశంలో జిల్లా మేనేజర్ సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.