కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే కర్ణాటక తరహాలోనే మోసపోతం

కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే కర్ణాటక తరహాలోనే మోసపోతం
  • బీసీలు, మున్నూరు కాపులను అణిచివేస్తున్న కాంగ్రెస్‌
  • 50 ఏండ్లు సేవ చేసిన పొన్నాల లక్ష్మయ్యను అవమానించిండ్లు
  • రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడమే కాంగ్రెస్సోళ్ల నైజం
  • మంథనిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి : కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే కర్ణాటక తరహాలోనే మోసపోతమని,  బీసీలను, మున్నూరు కాపులను అణిచివేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ అని, మంథనిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మ్యానీఫేస్టోతో పాటు తన సొంత మ్యానీఫేస్టో కరపత్రాలను భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి మధు విడుదల చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మోసపూరిత హమీలతో అక్కడి ప్రజలను కాంగ్రెస పార్టీ మోసం చేసిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా దేశంలో రాష్ట్రంలో బీసీలను, మున్నూరు కాపులను కాంగ్రెస్‌పార్టీ అణిచివేస్తుందని,  బీఆర్ఎస్ మానీఫెస్టో ఎంతో అద్బుతమన్నారు. 

50 ఏండ్లు సేవ చేసిన పొన్నాల లక్ష్మయ్యను అవమానించింది, కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడమే కాంగ్రెస్సోళ్ల నైజమని, ఈనాడు నోట్ల సంచులతో కొనుగోళ్లు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రజా ఆవసరాలను గుర్తించే పథకాలకు రూపకల్పన సీం కేసీఅర్ చేశారన్నారు. రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేస్తడో చెప్తలేడు 200 ఫించన్‌లో రూపాయిపెంచనోళ్లు వేలకు వేలు ఇస్తరంటే నమ్మలా అని, పార్టీ మ్యానీఫేస్టోతో పాటు సొంత మ్యానీఫేస్టో అమలు చేస్తున్నమన్నారు. గొప్పగా ఆలోచన చేసి బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలే
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ఆరుమాసాల్లోనే అక్కడి ప్రజలు ఆగమైపోతున్నారని, కాంగ్రెస్‌ను నమ్మితే కర్ణాటక తరహాలోనే మోసపోక తప్పదని  పుట్ట మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ కుమార్, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు, తగరం శంకర్ లాల్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల కిరణ్, సెగ్గం రాజేశం, మ్యాదరవేన కుమార్ యాదవ్, జింజర్ల శేఖర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.