వెల్గటూర్ లో మహిళ కళ్ళల్లో దుమ్ము కొట్టి, మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ..

వెల్గటూర్ లో మహిళ కళ్ళల్లో దుమ్ము కొట్టి, మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ..

వెల్గటూర్, ముద్ర :  వెల్గటూర్ మండలం కేంద్రంలో  ఓ మహిళ  ఇంట్లో పూజ చేస్తుండగా, ఓ వ్యక్తి నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చి ఆమె కళ్ళల్లో దుమ్ము కొట్టి ఆమె మెడలో గల పుస్తెల తాడును  సోమవారం చోరీ చేశాడు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకోసం చుట్టు పక్కల ప్రాంతాలను గాలిస్తున్నట్లు సమాచారం. కాగా ఉదయం పూట, ప్రజలు తిరుగుతున్న సమయంలోనే దుండగులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో వెల్గటూర్ మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.