తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ లో ముసలం

తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ లో ముసలం
  • తంగళ్లపల్లి ఎంపిపి మానసను త్వరలో జడ్పీ చైర్మన్ చేస్తా..
  • పూర్మాణి మంజులను జడ్పీ చైర్మన్ కాకుండా చేసింది నేనే
  • బీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు.. మరో వివాదంలో చైర్మన్ సాబ్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత, జిల్లాలో ప్రస్తుతం ఓ సంస్థకు చైర్మన్గా వ్యవహిరిస్తున్న నాయకులు సంచలన వాఖ్యలు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో బీఆర్ఎస్ యూత్ లీడర్ అబ్బాడి అనిల్ కు పితృ వియోగం చెందగా పరామర్శకు వెళ్తున్న సమయంలో ఈ వాఖ్యలు చేశారు. కారులో తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకులు సదరు చైర్మన్ తో ప్రయాణిస్తున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో తంగళ్లపల్లి జడ్పీటీసీ గా గెలిపించి జడ్పీ చైర్మన్గా చేయాలని అనుకున్న.. కానీ ఇప్పుడు ఆమె వద్దు.. తంగళ్లపల్లి ఎంపిపి పడిగల మానస ను త్వరలో జడ్పీ చైర్మన్ చేస్తా.. ప్రస్తుత జడ్పీటీసీ పూర్మాణి మంజులను జడ్పీ చైర్మన్ ను కాకుండా చేసింది నేనే అంటు సదరు బీఆర్ఎస్ నేతలకు చెప్పడంతో.. ఈ విషయం కాస్తా బయటకు తెలిసి.. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ లో ముసలం చోటు చేసుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరుస వివాదల్లో చిక్కుకుంటున్న ఓ సంస్థ చైర్మన్ తాజాగా తంగళ్లపల్లి మండల రాజకీయాల గురించి బీఆర్ఎస్ నేతలకే చెప్పి షాక్ ఇచ్చాడు.

మంత్రి కేటీఆర్ ప్రమేయం లేకుండా జడ్పీ చైర్మన్ ఎలా చేస్తాడు.. పూర్మాణి మంజులలింగారెడ్డిని రాజకీయంగా అనగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలను నిజమని తేలిపోయాయి. చైర్మన్ మాటలు తెలుసుకున్న జడ్పీటీసీ మంజుల భర్త పూర్మాణి లింగారెడ్డి తన సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. తంగళ్లపల్లి మండలంలో పార్టీ కోసం పని చేసుకుంటూ పోతుంటే..సదరు నేత తమపై కుట్ర పన్నుతున్నడని, మొన్న చైర్మన్ ఎన్నిక సమయంలో తాము అందరం కలిసి గెలుపుకు ప్రయత్నిస్తే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నడని లింగారెడ్డి సన్నిహితుల వద్ద వాపోయాడు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పదవుల విషయంలో ముందస్తుగా మంత్రి కేటీఆర్కు సంబంధం లేకుండా ప్రకటిస్తూ..తంగళ్లపల్లి మండలంలో పార్టీకి నష్టం కలిగిస్తున్నడని, క్యాడర్ ను విభజించి పాలిస్తున్నడని పేర్కొన్నారు. చైర్మన్ మాటలతో తంగళ్లపల్లి బీఆర్ఎస్ లీడర్లలో వర్గ విబేధాలు చోటు చేసుకున్నాయి.

సంస్థగత నిర్ణయాలతో మంత్రి కేటీఆర్కు తలనొప్పి చేస్తున్న నేత తాజా వాఖ్యలతో తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకుల అసహనానికి గురవుతున్నారు. తంగళ్లపల్లి ఎంపిపి పడిగెల మానసకు, జడ్పీటీసీ పూర్మాణి మంజులకు పదవుల పంచాయతీ పెట్టి..వారిని రాజకీయ వైరం పెట్టించడన్న ఆరోపణలు వస్తున్నాయి. తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకుల మధ్య పంచాయతీ ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి.