మొదలైన సతుల ఇంటింటి ప్రచారం 

మొదలైన సతుల ఇంటింటి ప్రచారం 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎన్నికల షెడ్యుల్ విడుదల కాగానే పతుల తరుపున సతుల ప్రచారం ప్రారంబం అయింది. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సతీమణి రాధిక సంజయ్ జగిత్యాల పట్టణ 21 వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా నిలువాలని ఓటు అభ్యర్థించారు. వారి వెంట స్థానిక కౌన్సిలర్ అల్లే గంగ సాగర్, శరత్ రావు,మహిళ కౌన్సిలర్ లు,బి అర్ ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.