దళితులకు మూడు ఎకరాలు ఏమైంది

దళితులకు మూడు ఎకరాలు ఏమైంది
Prajagosa BJP Bharosa

ముద్ర, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని సోమవారం నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కార్నర్ మీటింగులో మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  విచ్చేసిన  ఉపాధ్యక్షులు శీలం రాజు మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని మోసం చేసిన  ప్రభుత్వం అని రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని సమయ పాలన లేకుండా  మోసం చేస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయలేదని, దళిత బంధు ఇస్తానని దళిత సామాజిక వర్గాన్ని మోసం చేస్తుందని దుయ్యబట్టారు. రైతు వేదికలు నిర్మించలేదని, ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాములు కట్టలేదని విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పట్టించుకోవడంలేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని అన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధం కావాలని  బిజెపి కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు  ఓ బి సి  మోర్చా మండల అధ్యక్షులు  బొమ్మడి స్వామి, శక్తి కేంద్రం ఇన్చార్జి వంగల రాజు, బూత్ అధ్యక్షులు  శీతల సాగర్, కిసాన్ మండల మోర్చ ఉపాధ్యక్షులు సూర భాస్కర్, దుమాల దేవయ్య, ఇప్ప రాజు, పాముల దేవరాజు, మోతె వేణు, భరత్ ప్రదీప్, భరత్, లింగాల రాజు,బొమ్మిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.