ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : ముక్కోటి దేవతలకు ఆదిగురువు, సకల సృష్టికి ఆది పురుషుడు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు  సూర్యాపేట కలెక్టరేట్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విశ్వ కర్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.. అనంతరం మాట్లాడిన మంత్రి దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్సు కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప నిర్మాణాలను చేశారన్నారు. దేవతలచే పూజలందు కొన్న భగవాన్ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని, సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ విశ్వకర్మ వేసిన బీజమే దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు.