4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలివే...

4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలివే...

ముద్ర,తెలంగాణ:- RPF, RPSFలలో 4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండి.. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు SI, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీల మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.RPF రిక్రూట్‌మెంట్ 2024 అర్హత, వయోపరిమితి, దరఖాస్తు రుసుము మరియు మొత్తం సమాచారం క్రింద ఇవ్వబడింది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను ఒకసారి తనిఖీ చేయాలి.

రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)
పోస్ట్ పేరు: కానిస్టేబుల్ / సబ్ ఇన్స్పెక్టర్ (SI)
అడ్వాట్ నెం. CEN నం. RPF 01/2024 మరియు CEN నం. RPF 02/2024
పోస్టులు : 4660
ఉద్యోగ స్థలం: ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 14-05-2024
అధికారిక వెబ్‌సైట్: rpf.indianrailways.gov.in

కానిస్టేబుల్ - 4208
సబ్ ఇన్‌స్పెక్టర్ - 452

ఫీజుల వివరాలు

రూ.500 జనరల్/ఓబీసీ అభ్యర్థులకు .
SC/ST/ESM/మహిళలు/మైనారిటీలు/EWS అభ్యర్థులకు రూ.250.
వయో పరిమితి

కానిస్టేబుల్

కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

సబ్ ఇన్‌స్పెక్టర్ల కోసం

కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు