ఆంగోతు బావ్ సింగ్ ఆధ్వర్యంలో మహిళలచే సాముహిక కుంకుమార్చనలు

ఆంగోతు బావ్ సింగ్ ఆధ్వర్యంలో మహిళలచే సాముహిక కుంకుమార్చనలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: 46 వార్డ్ లో భక్తిశ్రద్ధలతో వినాయకుడి పూజలు తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా బిఆర్ఎస్ నాయకులు, 46 వ వార్డ్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఆంగోతు బావ్ సింగ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఐదో రోజు మహిళలచే చే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 46వ వార్డులో మొట్టమొదటిసారిగా వినాయకుడిని నెలకొల్పి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వినాయక చవితి రోజున మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. కులమతాల కతితంగా తొమ్మిది రోజులపాటు రోజుకొక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, సంక్రాంతి ముగ్గుల తో పాటు కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠధామం నిర్మాణం చేసి ఎంతో అభివృద్ధి చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి మరి ఒకసారి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సూర్యాపేటలో ఎంతో చైతన్యవంతం కలిగిన మహిళలు మంత్రిని ఆదరించి గెలిపించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దూరి సుధాకర్, పబ్బా ప్రకాష్, రేపాల యాదగిరి, సిహెచ్ రాములు, శ్రీరంగం కళ్యాణ్, సూది రెడ్డి వెంకట్ రెడ్డి, గోడిశాల శంకర్, కోట్ల రజిత రెడ్డి, ఆంగొతు సంధ్య, ప్రమీల, కళ్యాణి, మమత, నీలిమ, స్వప్న, ప్రసన్న, మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.