తుంగతుర్తిలో  శర వేగంగా సాగుతున్న అభివృద్ధి

తుంగతుర్తిలో  శర వేగంగా సాగుతున్న అభివృద్ధి
  • తుంగతుర్తి లో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులు హరీష్ రావు ,జగదీశ్ రెడ్డి
  • 100 పడకల ఆసుపత్రి తో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయ నున్నారా?
  • మంత్రుల పర్యటనకు సమాయత్తమవుతున్న బిఆర్ఎస్ శ్రేణులు!
  • మరోమారు భారీ జన సమీకరణ దిశగా బిఆర్ఎస్ అధిష్టానం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తన ప్రచార పర్వంలో దూకుడు మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్రామాల్లో మండలాల్లో స్వయంగా తానే పర్యటిస్తూ ఒకపక్క అభివృద్ధి సంక్షేమాల పథకాలను లబ్ధిదారులకు అందజేస్తూ ముందుకు సాగుతున్నారు . అలాగే కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసే ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతూ తరచూ ప్రజల మధ్యనే ఉంటున్నారు .ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు చేసి  పనులు సైతం ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పనులు శరవేగంగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు . అలాగే మరో అడుగు ముందుకు వేసిన ఎమ్మెల్యే వచ్చే వారం రోజుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును నియోజకవర్గానికి రప్పించి తుంగతుర్తి ప్రజల చిరకాల వాంఛ ఆయన వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయించనున్నట్లు సమాచారం .సుమారు 44 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న 100 పడకల ఆసుపత్రిని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాన నెరవేర్చడం కోసమే ఎమ్మెల్యే కృషి చేశారని ఈ విషయంలో ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి హరీష్ రావు లను ఒప్పించి విజయం సాధించారు .ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే తుంగతుర్తి లో ఆసుపత్రి నిర్మించి మరింత అభివృద్ధికి ముందు అడుగు వేస్తున్నారు .మంత్రి హరీష్ రావు తో పాటు ,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి సైతం నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పవచ్చు.