మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

 ప్రజలకు పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్మన్ శంకరయ్య

ఆలేరు (ముద్ర న్యూస్): తెల్ల దొరలకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పయనించి. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు అందిస్తూ. అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన మున్సిపల్ కౌన్సిలర్లు. బిఆర్ఎస్ నాయకులు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటాలను. త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాత చింతకింది రామాంజనేయులు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. మున్సిపల్ కౌన్సిలర్ బేటి రాములు. జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సీసా రాజేష్. నాయకులు మోర్తాల రమణారెడ్డి. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పత్తి వెంకటేష్. సీనియర్ నాయకులు సముద్రాల కుమార్. చింతల సాయిబాబా. సిపిఎం సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంగిలి విండో చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్. ఆలేరు రెవిన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఫసుపూనూరి వీరేశం. ఎండి ఫయాజ్. నరసింహులు. కాసులబాధ బన్నీ తో పాటు తదితరులు పాల్గొన్నారు....