ప్రజా సంఘల ఆధ్వర్యంలో మణిపూర్ హింసకాండకు వ్యతిరేకంగా నిరసన

ప్రజా సంఘల ఆధ్వర్యంలో మణిపూర్ హింసకాండకు వ్యతిరేకంగా నిరసన

ముద్ర మునగాల: మునగాల మండల కేంద్రంలో మంగళవారం మణిపూర్ లో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హింసకాండ కు వ్యతిరేకంగా  నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బుర్రి శ్రీరాములు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు దేవర వెంకటరెడ్డి  మాట్లాడుతూ గత మూడు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు మణిపూర్ రాష్ట్రంలో కుకీ గిరిజన తెగల వారిపై దాడులు దౌర్జన్యాలు హింసకాండ కొనసాగిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం చేసి బజార్లు వెంట తిప్పుతూ పాశ వికంగా కొట్టి చంపిన కొన్ని మతోన్మాద శక్తులను ఉరి తీసిన తప్పు లేదని అన్నారు గతంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో కూడా ప్రధానమంత్రి మౌనం వహించిన  విధానాన్ని తప్పుపట్టారు మణిపూర్ రాష్ట్రంలో గిరిజనుల భయభ్రాంతులకు గురి చేసి వారి ఆధీనంలో ఉన్న భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ఆలోచనలు మోడీ అనుసరించే విధానం గా ఉందన్నారు మణిపూర్ హింసకాండ పై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌన వహించడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో  డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఒట్టేపు సైదులు మండల డివైఎఫ్ఐ కార్యదర్శి గడ్డం వినోద్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పి వెంకన్న మండవ శేషు గోపాల్ సత్యం నారాయణ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు