రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మెదక్ లో కేక్ కట్ చేసిన పీసీసీ నేత మ్యాడం బాలకృష్ణ

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా సోమవారం మెదక్ పట్టణంలో పీసీసీ నేత మ్యాడం బాలకృష్ణ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మెదక్ చర్చి ఆవరణలోని సంధ్యా నిలయంలో గల వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు.జాతీయ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రభావితం చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, మెదక్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి పట్టణ ఎస్సి సెల్ నాయకుడు సంజీవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ చౌదరి, అశోక్ రెడ్డి, జాకీర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.