మెరుపు సమ్మె చేస్తాం -  టి ఎస్ ఆర్ టి సి  జాక్

మెరుపు సమ్మె చేస్తాం -  టి ఎస్ ఆర్ టి సి  జాక్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట :కార్మికులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాలను తగ్గించాలని, వేధింపులు ఆపాలని జనగాం డ్యూటీలు వరుసగా రెండు రోజులు రోజుకు 12 నుండి 14 గంటలు చేస్తే 3వ రోజు సెలవు ఇస్తామన్న డిపో అధికారుల ప్రతిపాదన అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని, నల్గొండ డీలక్స్ సర్వీసులు స్పెషల్ ఆఫ్ గ నడపాలని డిపో జాయింట్ యాక్షన్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష కార్మిక వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ స్థానిక డిపో గేట్ ముందు గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు హాజరై ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆర్టీసీ జాక్ , వెల్ఫేర్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్నిరోజులుగ యాజమాన్యం జనగాం, ఖమ్మం తదితర డ్యూటీలను వరుసగా  రెండు రోజులు రెండు డ్యూటీలు అంటే రోజుకు 14 గంటలు డ్యూటీలు చేస్తే 3వ రోజు సెలవు (స్పెషల్ ఆఫ్ ) ఇస్తామని డ్యూటీ చార్ట్ వేశారని, ఇది అత్యంత దుర్మార్గ మైన ఆలోచన అని, ఈ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్ కి అందించారు.అందరికి ఆమోదయోగ్యాంగా ఉంటే వేస్తామని హామీ ఇచ్చిన డిపో అధికారులు మాత్రం మల్లి నెల రోజుల తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అకస్మాత్తుగా 07/07/2023 నుండి జనగాం రూట్లో అమలు చేస్తామనడం కార్మికులను నమ్మించి గొంతుకోయడమే అని అన్నారు. వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కనీస అవసరాలకు సెలవు ఇవ్వకుండా వేధించడం తగదన్నారు. నెలలో 3 సెలవులు కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.డిపో ఖర్చులను తగ్గించుకోవడాని అనేక మార్గాలు ఉన్నాయని కార్మికులను కష్టాల్లోకీ నెట్టి మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేసి యాజమాన్యం ఆనంద పడటం ఎంత వరకు శ్రేయస్కరం కాదన్నారు.చనిపోయిన బంధువుల ఫొటోలు పెడితే తప్ప సెలవు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నల్గొండ డీలక్స్ సర్వీస్ లను స్పెష ఆఫ్ సర్వీస్ లుగా నడపాలని అన్నారు.యాజమాన్యం ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే రేపటి నుండి మెరుపు సమ్మె లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. 

ఈ ధర్నాలో JAC నాయకులు సుంకరి శ్రీనివాస్, అంజయ్య, బత్తుల సుధాకర్, P M రావు, సేవ్య, వెల్ఫేర్ సభ్యులు భాను నాయక్,శ్రీనివాస్ రెడ్డి,ఎర్ర వెంకన్న, తుల్లా రాములు,యాకస్వామి,  DS రావు, నరేష్, ఎల్లయ్య, పర్శరాములు,గజ్జి. శ్రీను,దామోదర్, సురేష్,అద్దె బస్సు డ్రైవర్లు శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న,  మహిళా కార్మికులు ఎల్లమ్మ, యాకమ్మ, సైదమ్మ,మల్లికా, మంజుల, స్వరూప,శ్రీదేవి, కరుణ, బేగం,మంగమ్మ, కౌసల్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.