భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం

భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం

తూప్రాన్, ముద్ర: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూప్రాన్​, మనోహరాబాద్ మండలాల్లోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూప్రాన్ మండలంలోని హల్దీ వాగుకు భారీగా వరద నీరు వచ్చి పారుతుండటంతో మండలం లోని కిష్టాపూర్, వెంకటాయపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పని నిమిత్తం,కళాశాలలకు వెళ్లే యువత వర్గల్ మండలం నాచారం గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు గ్రామాలలో, కాలనీలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పై నుండి భారీగా వరద నీరు వెళుతుండటంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. రహదారి పై భారీగా నీరు నిలవడంతో నీరు వెళ్లేలా రోడ్డుపై డివైడర్ ను తొలగించారు.