అంగరంగ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

అంగరంగ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

ముద్ర, కోరుట్ల: కోరుట్ల మండలం నాగులపేట గ్రామం లో గూడెం అయ్యప్ప దేవస్థాన గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తం స్వామి వైదిక నిర్వాహణలో గ్రామ పురోహితులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ, కిషన్ శర్మ ఆధ్వర్యంలో మరియు నాగుల పేట గ్రామ స్వాములు  అయ్యప్పపడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పురుషోత్తంగురు స్వామి మాట్లాడుతూ  నాగులమ్మ దేవాలయం లో గత 22సంవత్సరాలుగా గ్రామ అయ్యప్ప స్వామి సేవా సమితి మరియు గ్రామ ప్రజల సహకారం తో అయ్యప్పపడి పూజను నిర్వహిస్తున్నారని ఈ గ్రామం లో నాగులమ్మ స్వయంభూగా వెలసిందని కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారని, ఇక్కడ పూజలు చేయటం వలన సమస్త కాల సర్ప, కుజ దోషాలు తొలగి పోతాయని ఇలాంటి అమ్మ వారి సన్నిధిలో పడి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ప్రతి ఒక్కరు పిల్లలకు భగవద్గీత నేర్పించాలని, హిందూ సాంప్రదాయాలను కాపాడాలని, అలాగే గోవును పూజించాలని, ప్రతి హిందువు ఇంటిపై కాషాయపు జెండా ఎగిరేయాలని అన్నారు. అయ్యప్ప పూజకు అరటి ఆకులతో చక్కటి మండపాన్ని ఏర్పర్చి అష్టాదశ కళాశాలతో అయ్యప్ప స్వామికి పంచామృత కలశాభిషేకం నిర్వహించి పదునేనిమిది మెట్ల పూజ నిర్వహించారు. అయ్యప్ప భజనతో భక్తులు పులకరించారు.ఈ కార్యక్రమం లో తోట నారాయణ, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, గురు స్వామి లక్షి నారాయణ, కోరుట్ల అయ్యప్ప దేవాలయ గౌరవాధ్యక్షులు చిద్రాల నారాయణ, స్వాములు నాగరాజు, నర్సారెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్, సాగర్ స్వాములు మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.