భూపాలపల్లి డిసిహెచ్ఎస్ సంజీవయ్య పై వేటు..

భూపాలపల్లి డిసిహెచ్ఎస్ సంజీవయ్య పై వేటు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆకుల సంజీవయ్యపై వేటు పడింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని వైద్య విధాన పరిషత్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల సీహెచ్ సీ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ ఆకుల సంజీవయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిహెచ్ఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను క్రమశిక్షణా చర్యల కింద డాక్టర్ సంజీవయ్యను తొలగిస్తున్నట్లు కమీషనర్ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో డిప్యూటి సివిల్ సర్జన్ చిట్యాల, భూపాలపల్లి సీహెచ్ సీ ల సూపరింటెండెంట్ డాక్టర్ జీడి తిరుపతిని భూపాలపల్లి జిల్లా డిసిహెచ్ఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.