ఆయిల్ పామ్ సదస్సులో పాలుగోన్న జిల్లా రైతులు

ఆయిల్ పామ్ సదస్సులో పాలుగోన్న జిల్లా రైతులు

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట:  కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం లో జరిగిన ఆయిల్ పామ్ రైతులకు జరిగిన ఒక రోజు వర్క్ షాప్ కు సూర్యాపేట జిల్లా నుండి ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతులను తీసుకువెళ్లారు. సిద్దిపేట జిల్లా ములుగు లో ని విశ్వద్యాలయ లో నిర్వహిచిన సదస్సులో ఆయిల్ పామ్ సాగులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు , ఎరువుల ,పురుగు మందుల వాడకం విధానం పైనా రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ అధికారి బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ ,పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా మేనేజర్ జె హరీష్ ,క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు ,ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్న రైతులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి , మధుసూదన్ రెడ్డి ,అక్కల నరేష్ , బ్రహ్మ రెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ హనుమంతరావు ను కలసిన రైతులను జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి , సూచనలు సలహాలు ఏవిదంగా అందుతున్నాయి అని రైతుల ను అడిగి తెలుసుకున్నారు.