విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు భయం

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు భయం

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవాచేశారు.  కర్ణాటకలో జరిగిన బహిరంగసభలో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించామని తెలిపారు. ఈసారి కూడా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్  విముక్తి, స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదన్నారు.

బీదర్‌ )కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదన్నారు. గరోటా గ్రామస్థుల త్యాగాలను అమిత్‌షా ప్రశంసించారు. 2.5 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు క్రూరుడైన నిజామ్ సైన్యం గరోటా గ్రామస్థులను హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామన్నారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారన్నారు. అదే గడ్డపైన మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని చెప్పారు. ఇది ఎవరి దృష్టినీ తప్పించుకోదన్నారు. హైదరాబాద్ నుంచి నిజాం పాలకుడిని తప్పించడంలో మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన పోషించిన పాత్ర వల్లే బీదర్ భారతదేశంలో అంతర్భాగం అయిందని అమిత్‌షా తెలిపారు.