Prajavani - ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం...

Prajavani - ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ప్రజావాణి మళ్ళీ మొదలు కానుంది. ఈరోజు నుంచి ఈ కార్యక్రమం పునఃప్రారంభం. ప్రజల దగ్గర నుంచి అర్జీలను ఇక మీదట ఎటువంటి అంతరాయం లేకుండా తీసుకుంటామని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  తెలిపారు. ఎన్నికల మోడ్ ఆఫ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాక ఈసీ ఎన్నికల కోడ్ విధించింది. దీంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు కోడ్ ముగియడంతో మళ్ళీ ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.