అభివృద్ధి సంక్షేమలో అగ్రగామి తెలంగాణ రాష్ట్రం 

అభివృద్ధి సంక్షేమలో అగ్రగామి తెలంగాణ రాష్ట్రం 
  • సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్
  • ధర్మపురిలో  రూ. 6 .63 కోట్లతో  పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన మంత్రి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అభివృద్ధి సంక్షేమలో అగ్రగామి తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి మైనారిటీ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మాత్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ధర్మపురి పట్టణంలో 6 కోట్ల 63 లక్షలతో  పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల మాట్లాడుతూ అందరూ కలలు కంటున్నటువంటి సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి చిరు వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి తల్లులు ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడున్న పరిస్థితి వాస్తవంగా చాలా దారుణమైన పరిస్థితి ఉండే మార్కెట్ ఏరియాలో దాదాపు రెండు మూడు మీటర్ల లోపలికి ఎంతో అస్తవ్యస్తంగా కాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉండేది పక్కనే ఉన్నటువంటి సినిమా థియేటర్ ఎప్పుడో బంద్ అయిపోయింది అందులో కాలు పెట్టడానికి కూడా ఎవరూ సాహసం చేసే పరిస్థితి లేదని మంత్రి గుర్తు చేశారు

ఇక చింతామణి చెరువులో మనుషులు పందులు కలిసి తిరిగే పరిస్థితి ఉండే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చింతామణి చెరువులో నుండి పొద్దున్నే నీళ్లు తీసుకువెళ్లి లక్ష్మీ నృసింహ స్వామికి అభిషేకం చేసే ఆనవాయితీ ఉండేది అటువంటి చింతామణి చెరువు ఇలా తయారయింది అని అంటే చాలా బాగా అనిపించేది, ధర్మపురి పట్టణంలో ఎక్కడా లేని సమస్యను ఎదుర్కొన్నామని గేట్లు పెట్టక ముందు ఈ ఊర్లో ఉన్న మురికి నీరు గోదావరి లో ఇంకి పోతుండే అప్పుడు ఏ సమస్య లేదని ఎప్పుడైతే ఎల్లంపల్లి గేటు పెట్టిన పక్షంలో బ్యాక్ వాటర్ ఆగిందని ఆ నీళ్లు దుర్గంధం ఉండడంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఉండేదని అన్నారు.

గ్రామపంచాయతీలో ఎందుకు ఈ సమస్యను పరిష్కారం చేయలేదని రంధీలో ఉండే వాళ్ళమని చెప్పారు. మున్సిపాలిటీ కాకముందు01 కోటి రూపాయలు పోగుచేసి డ్రైనేజీ నిర్మాణం చేపట్టగా నిధులు సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డామని చెప్పారు కానీ తొందరలో మున్సిపాలిటీ చేసుకోవడం మనం అదృష్టంగా భావించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దివాకర, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పిటిసి బత్తిని అరుణ, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సౌళ్ళ భీమయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందరపు రామన్న, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్, , కౌన్సిలర్ లు పాల్గొన్నారు.