ముదిరాజ్ లపై వివక్ష ఎందుకో ? ..మహాసభ  జిల్లా అధ్యక్షులు

ముదిరాజ్ లపై వివక్ష ఎందుకో ? ..మహాసభ  జిల్లా అధ్యక్షులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన ముదిరాజులపై ప్రభుత్వానికి వివక్ష ఎందుకని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీలగట్టయ్య ప్రశ్నించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వివక్షకు గురవుతున్న ముదిరాజులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో అతిపెద్ద కులంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యంలో వివక్షకు గురైంది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీకి మాత్రమే పరిమితంకావటం 9 డిసిసిబి చైర్మన్ లలో ఒక్క దాంట్లో కూడా ముదిరాజ్ లు లేకపోవడం ,32 జిల్లా పరిషత్ చైర్మన్ లలో ఒక్కటి కూడా లేకపోవడం 50 నామినేటెడ్ పోస్టులలో ఒక్క చైర్మన్ పోస్టు పిట్టల రవీందర్ కి రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ దక్కటం  ఆందోళనకు గురిచేస్తుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి రాజ్యాధికారంలో భాగస్వాములు కావటానికి అవకాశం కల్పించాలని ముదిరాజ్ మహాసభ జనగాం జిల్లా కోరుకుంటుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి భూర్ల శంకర్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత కార్యదర్శి గోరంట్ల యాదగిరి, ముదిరాజ్ జిల్లా యువజన కార్యవర్గ సభ్యులు పిట్టల అనిల్, రేగుల రాకేష్, యూత్ వెల్ఫేర్ సొసైటి సభ్యులు దారం నాగరాజ్, పిట్టల రమేష్, నీల శివలింగం, భూర్ల రాజశేఖర్, పిట్టల రాకేష్, శగ సురేష్  తదితరులు పాల్గోన్నారు.