SI లుగా ఉద్యోగోన్నతి పొందిన ASI లు

SI లుగా ఉద్యోగోన్నతి పొందిన ASI లు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నుండిమల్లేష్, యాదయ్య, విల్సన్  మహిళా ASI నీలిమ లు ASI నుండి SI లుగా ఉద్యోగోన్నతులు పొందారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎస్పి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ
విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలనీ సూచించారు. సూర్యాపేట జిల్లాలో ఏ.ఎస్.ఐ.లుగా పని చేస్తున్న నలుగురు ఏఎస్ఐలకు  ఎస్.ఐ.లుగా పదోన్నతులు లభించాయి. ఉద్యోగున్నతి పొందిన వారిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు యస్.పి  అభినందించి శుభాకాంక్షలు తెలిపినారు.   సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా వారి బాధలు, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.  పదోన్నతుల ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, సిబ్బందితో సమన్వయంతో పని చేస్తూ నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమర్ధవంతంగా పని చేయాలని చెప్పారు. మన పనితీరుతోనే పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం పెంపొందుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎస్.ఐ.లుగా పదోన్నతులు పొందిన వారితో పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ గౌడ్ ఉన్నారు.

పోలీస్ గ్రీవెన్స్ డే: సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి 13 పిర్యాదులు వచ్చాయి. పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు ఎస్పీ పరిశీలించారు. ఇతరులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవనీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ వారసులపైనే ఉంటుందనీ,వృద్ధులను ఇబ్బంది పెడితే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము అని ఎస్పీ  అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి  బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎస్పీ  వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు  ఉన్నారు.