కాంగ్రెస్ పార్టీలో చేరిన బజ్జూరి వెంకటరెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన బజ్జూరి వెంకటరెడ్డి

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండలంలోని బేతావోలు  గ్రామంలో సోమవారం, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో, టిఆర్ఎస్ పార్టీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, బజ్జూరి వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో,   కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయనకు ఉత్తంకుమార్ రెడ్డి కండకప్పి పార్టీలోకి ఆహ్వానించారు , ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, 9 సంవత్సరాల  టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో జనం నలిగిపోతున్నారని, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని,  గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే,  సబ్ స్టేషన్లు గాని, రోడ్లు గాని  కొన్ని వేల ఇందిరమ్మ ఇల్లులు  గాని,అభివృద్ధి బేతావోలు గ్రామ చరిత్రలో, నాకంటే ఎక్కువ చేసి ఉంటే నేను రాజకీయం నుంచి తప్పుకుంటానని, ఆయన అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని, బేతావోలు గ్రామానికి డబల్ రోడ్డు వంటి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను చేస్తామని, ఆయన అన్నారు, టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ మా తర్వాత వచ్చిన వారు, అభివృద్ధిని పక్కకు పెట్టి, లిక్కర్ సిండికేట్లు టెన్ పర్సెంట్ వాటాలతో, కాంట్రాక్ట్ కమిషన్లతో, లేఔట్ల కమిషన్లతో, మట్టి మాఫియాతో , ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాత్రం అవినీతి విషయంల్లో ,కొత్త విధానాలు, కొత్త విషయాలతో, ఎన్నడూ వినలేదు, శాండు ల్యాండ్ వైను మైనింగ్ మాఫియా,వంటి వాటిలో ముందున్నారని, కోదాడలో నలుగురు ఎమ్మెల్యేలు మారినామని, ఎవరు ఇలా చేయలేదని, ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, టీపిసిసి కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ, ఎడవల్లి పుల్లారావు, ఏ ఎన్ టి సి రాష్ట్ర అధ్యక్షులు ఎరగాని నాగన్న, వంగవీటి రామారావు, కందుల కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు మండల శాఖ అధ్యక్షులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు