నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో బయటపడ్డ వర్గపోరు

నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో బయటపడ్డ వర్గపోరు
  • అన్నారం గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్ర గర్షణ- బాహాబాహీకి దిగిన రెండు వర్గాలు
  • మండల పార్టీ అధ్యక్షుడిని, రైతు కోఆర్డినేటర్ను నిలదీసిన  బిఆర్ఎస్ పార్టీ మరో వర్గం
  • ఇదే తరహాలో మరికొన్ని గ్రామాల్లో  బిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం లో ఇప్పటివరకు  బిఆర్ఎస్ పార్టీ ఎదురులేని పార్టీగా ప్రచార పర్వంలో దూసుకుపోతుంది .కాగా గ్రామాల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది .తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో శనివారం  బూతు స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించడానికి వెళ్లిన మండల పార్టీ అధ్యక్షుడికి గ్రామ టిఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం నుండి తీవ్ర నిరసన ఎదురైంది. అదే గ్రామానికి చెందిన మండల రైతు సమితి కోఆర్డినేటర్ దొంగరీ  శ్రీనివాస్ను మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్యను తమ గ్రామంలో సమావేశం నిర్వహించడానికి మీరు ఎవరని మొదటి నుండిపార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా మధ్యలో వచ్చిన వారికి ఎలా ఇస్తారని నిలదీశారు. ఒక దశలో ఘర్షణ తీవ్రరూపందాల్చి కొట్టుకునేంతవరకు వెళ్ళింది. తమ గ్రామంలో మీరు గ్రామ శాఖ సమావేశ నిర్వహించేది లేదని తెగేసి చెప్పారు. గత సంవత్సర కాలంగా అన్నారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా  ఛీలిపోయింది .పలుమార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని భావించిన ఒక వర్గం వారు ఎన్నికల సమయం రావడంతో సమావేశం నిర్వహణకు వచ్చిన వారిని తీవ్ర పదజాలంతో నిరసన తెలిపారు. దీంతో రెండు  వర్గాల మధ్య  ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది.

ఇదే తరహాలో మరికొన్ని గ్రామాల్లో సైతం రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్న  బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ కమిటీ సమావేశాల సందర్భంగా ఘర్షణలకు దిగే అవకాశం ఉందని పలువురు అంటున్నార రెండు ,మూడు రోజుల క్రితం కరివిరాల గ్రామంలో సైతం గ్రామంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించడానికి వెళ్లిన మండల ప్రధాన కార్యదర్శి, వైస్ ఎంపీపీ లకు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చేదు అనుభవాన్ని మిగిల్చింది .సమావేశం నిర్వహించకుండానే వారు వెనుతిరిగారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ  బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ పోరు బహిర్గతం కావడంతో అధిష్టానం ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేక ఇరువర్గాలను శాంతింపజేసి సమన్వయం కుదురుస్తుందో వేచి చూడాల్సిందే.