పొత్తులో భాగంగా మునుగోడును సీపీఐకే కేటాయించాలి  సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి విజ్ఞప్తి

పొత్తులో భాగంగా మునుగోడును సీపీఐకే కేటాయించాలి   సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర ధర్మాన్ని పాటించి సిపిఐ కి మునుగోడు స్థానాన్ని వదిలివేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలోని జిల్లా సిపిఐ కార్యాలయం ధర్మ బిక్షం భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ మునుగోడులో 10 సార్లు పోటీ చేశామని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సిపిఐదని రాష్ట్రవ్యాప్తంగా ఐదు స్థానాలు  కోరితే రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందని ఆ రెండు స్థానాలు కూడా మేం కోరుకునేవి ఇవ్వాలి కానీ వాళ్ళకి నచ్చిన సీట్లు కాదని ఆయన హితవు పలికారు మేము కోరిన సీట్లు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా రెండు వామపక్ష పార్టీల ఓట్లు కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అవుతాయని, మిర్యాలగూడ భద్రాచలం మునుగోడు కొత్తగూడెం సీట్లను వామపక్ష పార్టీలకు వదిలి వేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

 మునుగోడు సీటును సిపిఐ కి కేటాయించకపోతే స్నేహపూర్వక పోటీలో ఉంటామని ఇది మునుగోడు నియోజకవర్గ మరియు మూడు జిల్లాల సిపిఐ కార్యకర్తలు యొక్క స్తిరాభిప్రాయమని, కాంగ్రెస్ మరియు వామపక్షాల పొత్తు పట్ల సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా వట్టి అబద్దమని ఆయన కొట్టివేశారు. మరో 35 రోజుల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గద్దె  దించేందుకు కాంగ్రెస్ వామపక్ష కార్యకర్తలు తీవ్ర కృషి చేయాలని, అబద్దాలతో మాయమాటలతో బూటకము పన్నాగాలతో రెండు మార్లు గద్దెనె క్కిన టిఆర్ఎస్ వల్ల తెలంగాణ కు ఒరిగింది ఏమీ లేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువత తీవ్ర వైరాస్యంలో ఉన్నారని, నాలుగున్నర  సంవత్సరాలు పూర్తయినా రుణమాఫీ చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేశంతో ఉన్నారని, విద్యార్థులు యువజనలు మహిళలు రైతులు వ్యవసాయ కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారని వారి వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ఆయన కోరారు.

జిల్లా కౌన్సిల్ సమావేశానికి పోకల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించక సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్  గన్నా చంద్రశేఖర్, ఉజ్జీని రత్నాకరరావు,  జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అనంతుల మల్లీశ్వరి  ధూళిపాళ ధనుంజయ నాయుడు  మండవ వెంకటేశ్వర్లు మేకల శ్రీనివాసరావు ఉస్తేల నారాయణరెడ్డి ఎల్లంల యాదగిరి బద్దం కృష్ణారెడ్డి బత్తినేని హనుమంతరావు ఎస్ కే లతీఫ్ దేవరం మల్లీశ్వరి మూరగుండ్ల లక్ష్మయ్య బూర వెంకటేశ్వర్లు గోపగాని రవి చిలక రాజు శ్రీను, చేపూరి కొండలు అమరారపు పుల్లయ్య త్రిపురO సుధాకర్ రెడ్డి, ముళ్ళ జానయ్యఎస్కే సాహెబ్ అలీదొడ్డ వెంకటయ్య రేమిడాల రాజు తదితరులు పాల్గొన్నారు