స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా - పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి 

స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా - పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి 
  • రామగుండం నియోజకవర్గంలో  నా ఎదుగుదలను చూడలేకపోతున్నారు....  నన్ను ఎంతో అవమానించారు అయినా భరించాను
  • బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశా... అయినా గుర్తింపు లేదు అందుకే రాజీనామా...

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: రామగుండం నియోజకవర్గం లోని కొంతమంది నాయకులు నా ఎదుగుదలను చూడలేక నన్ను ఎంతో అవమానించారని టిఆర్ఎస్ పార్టీ కోసం బహర్నిశలు పనిచేశానని అయినా ఆ పార్టీలో తన గుర్తింపు లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఘాటుగా విమర్శించారు. గత 30 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని మహిళలకు ఎక్కడా అవకాశం లేదని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్ సీ ఎల్, మెడికల్ కళాశాలలో ఉద్యోగ దందా జోరుగా నడుస్తుందని ఆరోపించారు. ఇక్కడ గెలిచిన కొంతమంది నాయకులు నీచ రాజకీయలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా నన్ను అనగదొక్కడానికి కౌశిక హరి, మక్కాన్ సింగ్, కోరుకంటి చందర్ లు ప్రయత్నాలు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కోరుకంటి చందర్ కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడితే చందాలు వేసుకుని ఎమ్మెల్యే గా గెలిపించారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ గెలుపులో కూడా నా కృషి ఎంతో ఉందని,  నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. పత్రికలలో ప్రకటనలు కాదు...దమ్ముంటే మహిళలకు అవకాశం కల్పించడంలో ఆచరణలోకి తీసుకురావాలన్నారు. నాతోపాటు నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. 

మీడియో సమావేశంలో కంటతడి పెట్టిన సంధ్యారాణి 

తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.