బాలుడి ఫై  వీధి కుక్కల దాడి -భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు 

బాలుడి ఫై  వీధి కుక్కల దాడి -భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని టిఆర్ నగర్ లో నలుగురు బాలురు ఆడుకుంటుండగా కుక్కలు చరణ్ అనే బాలుడిఫై దాడి చేసాయి. కుక్కలను చూసి బయపడి పోయిన సహచర బాలురు పారిపోగా, స్థానికులు కుక్కలను తరిమికొట్టి చరణ్ ను రక్షించారు. వెంటనే కుటుంబ సభ్యలు గాయపడిన బాలుడిని పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకుని రాగ చికిత్స పొందుతున్నాడు.

ఇప్పటికే జగిత్యాల పట్టణంలో 10 మందికి ఫైన కుక్కలు దాడి చేసి గాయపరిచిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలతో పాటు స్థానిక కౌన్సిల్ సభ్యురాలు హనుమడ్ల జయశ్రీ కుక్కల దాడులఫై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఎలాంటి చర్యలు లేవని పట్టణ ప్రజలు ఆగ్రహం వక్త్యం చేస్తున్నారు. పట్టణంలో పిల్లలని ఒంటరిగా బయటకు పంపే పరిస్థితి లేదని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరిఫై కుక్కలు దాడులు చేస్తున్నాయని ప్రజలు బయన్దోలనలకు గురిఅవుతున్నారు. ఇప్పటికి అయిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.