రక్తహీనతే ప్రసవ మరణాలకు కారణం- రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల

రక్తహీనతే ప్రసవ మరణాలకు కారణం- రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అత్యధిక ప్రసవ సమయంలోని మరణాలకు రక్త హీనత ప్రధాన కారణమని, రక్త హీనత రహిత జిల్లాగా నిర్మల్ ను తీర్చిదిద్దాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. 
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనిమియా సే నిర్మల్  ముక్త్, సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై  నిర్మల్ లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన  పునశ్చరణ శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఆపరేషన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచడానికి, అదేవిధంగా   రక్తహీనత లేకుండా అన్ని చర్యలు చేపట్టి  రక్తహీనత  రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఆరోగ్య రంగంలో  మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని, రోగులకు అన్ని సౌకర్యాలను కల్పించి నాణ్యమైన సేవలు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
త్వరలోనే గర్భవతులకు న్యూట్రిషన్ కిట్స్ అందించి వారి  పోషణ, ఆరోగ్య స్థాయి మెరుగుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి,జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ధనరాజ్ , జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి , వైద్యులు పాల్గొన్నారు.