వేములవాడలో ‘చలిమెడ’ రాజకీయ అలజడి..

వేములవాడలో ‘చలిమెడ’ రాజకీయ అలజడి..
  • ఎమ్మెల్యే రమేశ్ బాబు వ్యతిరేఖులంతా కలిసి తిరుగుతున్నారు
  • మండలాల వారిగా ముఖ్య నేతలు చలిమెడ లక్ష్మీనరసింహరావుకు టచ్ లోకి
  • కార్యాలయం ఓపెనింగ్ మరుసటి రోజే చలిమెడకు మంత్రి కేటీఆర్ ప్రాధాన్యత తో మారీన సీన్
  • లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకుంటున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు
  • అతి విశ్వాసం..చెప్పుడు మాటలతో.. తీరని నష్టం చేసుకుంటున్న వైనం
  • నియోజవర్గంలో తెలంగాణా ఉద్యమకారులు, పార్టీ సీనియర్లంతా చలిమెడ వైపే
  • వివదాల సుడిగుండంలో చెన్నమనేని.. వ్యక్తిగత సహయకుడితో మరింత నష్టం..
  • నమ్మిన బంటు జడ్పీచైర్మన్ నే దూరం చేసుకున్న ఎమ్మెల్యే సాబ్
  • అచ్చిరాని మాటలు.. వివాదస్పద విమర్శలతో అధిష్టానానికి దూరం
  • వేములవాడ అభివృద్ది కార్యక్రమాల ఓపినింగ్కు సమయం ఇవ్వని మంత్రి కేటీఆర్
  • వేములవాడ లో చలిమెడ లక్ష్మీనరసింహరావుకు కలిసివస్తున్న రాజకీయ అనుకూల పరిస్థితులు
  • మేం వ్యక్తులకు పని చేయం.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటూ ఇప్పటికే పార్టీ క్యాడర్ ప్రకటన..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజకీయాల్లో ఎప్పుడు ఏం మార్పులు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. చెన్నమనేని వంశానికి కంచుకోట ఉన్న వేములవాడ నియోజకవర్గం.. ఇప్పుడు బద్దలవుతుంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఆర్థిక శక్తి.. వేములవాడ ఎంట్రీతో.. వేములవాడ రాజకీయాల్లో ఒక అలజడి మొదలైంది. రాజకీయ వివాదాల సుడిగుండంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు చిక్కుకొని తన వివాదస్పద మాటలతో.. ఏకపక్ష నిర్ణయాలతో..లీడర్ను, క్యాడర్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో.. ఇటు సోంత పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి దూరం అవుతు వస్తున్నాడు.

వేములవాడ లో ఎమ్మెల్యే వైఖరితో పార్టీ క్యాడర్ ఎప్పుడు ఎటు జంప్ అవుతారో.. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఎవరికి చేయమంటే వారికే పని చేస్తామంటూ సీనియర్లు, మేజార్టీ లీడర్లు తమ వ్యక్తిగత భావాలు బహిరంగగానే చెప్పుకోవడంతో ఎమ్మెల్యే రమేశ్బాబు పై పార్టీ క్యాడర్ సైతం ఎవరు అనుకూలంగా లేరని అర్థమవుతుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచన చెన్నమనేని రమేశ్బాబుకు జర్మని పౌరసత్వ వివాదం తప్పా.. ఏ ఆరోపణ లేదు.. కానీ ఈ సారి కొన్ని ఆరోపణలు కూడా చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తన వ్యక్తిగత సహయకుడితో వేములవాడ నియోజకవర్గంలో రాజకీయంగా నష్టం జరుగుతుందని చర్చ జరుగుతుంది.

పార్టీ లీడర్లను,కార్యకర్తల మధ్య సమన్వయ లోపానికి కారణం కూడా ఇయనే అనే విమర్శలు వస్తున్నాయి. వేములవాడ నియోజకవర్గంలో పలు పోస్టింగ్ ల విషయంలో.. కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగల భర్తిలో కూడా ఎన్నడు లేనివిధంగా కొన్ని ఆరోపణలు రావడం కూడా ఎమ్మెల్యే సాబ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీస్తుందని చర్చ కొనసాగుతుంది. వివాదరహితుడు.. ముక్కుసుటి మనషి, పైస అవినీతి ఆరోపణలు లేని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబుకు సెకండ్ క్యాడర్ నమ్మిన వారే.. ఎమ్మెల్యేను చెడ్డపేరు తెస్తూ.. రాజకీయంగా పుట్టిముంచుతున్నరన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ లీడర్లను, క్యాడర్ను కాపాడుకోవడంలో..ఏమైన అపద వస్తే ఆదుకోవడంలో ఎమ్మెల్యే విఫలమవుతున్నరన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి సిద్దాంతం లేదు.. కులం ఏంది ..కుల రాజకీయాలు ఏంది.. కేటీఆర్ తాబేదార్లకు.. నేను చెప్పిన ఈ పార్టీకి సిద్దాంతాలు లేవంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రమేశ్ బాబు మాట్లాడిన విడియోలు వైరల్ చేసి.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర అసహానానికి గురౌనట్లు సమాచారం.

వేములవాడ లో బీఆర్ఎస్కు వేములవాడ లో అల్టర్నెట్ క్యాండిటెట్ లేక.. గెలుపు గుర్రాలు లేక రమేశ్బాబుకే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పౌరసత్వం వివాదం కోర్టులో నలుగుతుండగా..ఎప్పుడు ఈ తీర్పు వస్తుందో తెలియన పరిస్థితుల్లో.. వేములవాడ లో ఎమ్మెల్యే తీరుతో.. జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. అధిష్టానం కూడా అల్టర్నెట్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దృష్టి సారించి చలిమెడ విద్యా సంస్థల అధినేత..రాజకీయంగా..ఇప్పటికే పేరున్న వ్యక్తి చలిమెడ లక్ష్మీనరసింహారావును రంగంలోకి దింపినట్లు అర్థమవుతుంది. దీనికి తోడు చలిమెడ సైతం వేములవాడ నియోజకవర్గంలో తన సోంత మండలమైన కోనరావుపేటలో పాఠశాలల నిర్మాణం, వివిధ సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, ఉచిత ఆపరేషన్ల చేయిస్తూ.. ప్రజలకు దగ్గరవుతు వస్తున్నాడు. ఉన్నట్లుండి సొంత మండలం కోనరావుపేట మండల పరిధి దాటి ఏకంగా వేములవాడ నడిబొడ్డున ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కనే మరో పార్టీ కార్యాలయం ప్రారంభించడం బారిగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ హజరుకావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం అయ్యింది.

పార్టీ లైన్ దాటి ఒక ఎమ్మెల్యేకు పోటీగా ఆఫీస్ ప్రారంభించడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోపం చేయాల్సి ఉండగా..మరుసటి రోజే.. సిరిసిల్ల నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి సాయంత్ర వరకు తన వెంటేసుకోని తిరిగాడు. స్టేజీ మీద లక్ష్మీనరసింహరావు కనిపించకపోతే.. ఆయన్ను పిలవండి అంటూ పైకి పిలిపించుకొని రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఏకంగా హెలిక్యాప్టర్ లో ఎక్కించి సుబ్బారెడ్డి కి తోడుగా హైదరాబాద్కు వెళ్లాలని మంత్రి కేటీఆర్.. దగ్గరుండి పంపించారు. ఈ పరిణామాలతో వేములవాడ ఎమ్మెల్యే తో సైతం.. ఎమ్మెల్యే మద్దతుదారులంత ఆత్మరక్షణలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో చెన్నమనేనికా..చెలిమెడకా టికెట్ కేటాయింపు..తాము ఎవరి దిక్కు ఉండాలో అంతు చిక్కక సతమతమవుతున్నారు.

దీనికి తోడు వేములవాడ లో పలు అభివృద్ది కార్యక్రమాలు పనులు పూర్లయి ఓపినింగ్కు సిద్దంగా ఉన్న మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేకు సమయం ఇవ్వడం లేదని తెలిసింది. ఎప్పుడు రాజన్నసిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ వచ్చిన చలిమెడ లక్ష్మీనరసింహరావును వెంటబెట్టుకోని కార్యక్రమాలకు హజరు అవుతుండటతో పరోక్షంగా వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చలిమెడనే అనే సంకేతాలు ఏకంగా బీఆర్ఎస్ అధిష్టానమే ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. వేములవాడ లో చలిమెడ ప్లెక్సీలు తీసియించడం.. చలిమెడ వైద్య సంస్థలపై ఏకంగా ఎమ్మెల్యే నేరుగా ఆరోపణలు చేయడం.. చలిమెడనే తనకు ప్రత్యర్థి అన్నట్లు ఎమ్మెల్యే రమేశ్బాబు మాటలు, విమర్శలు ఉండటంతో.. చలిమెడ లక్ష్మీనరసింహరావు సైలెంట్గా ఉన్నవారు సైతం కౌంటర్ అటాక్ చేసుకుంటూ వస్తూ ఏకంగా వేములవాడ నడిబొడ్డున జెండా పాతే పరిస్థితికి వచ్చాడన్న చర్చ కొనసాగుతుంది.

మండలాల వారిగా బీఆర్ఎస్ లీడర్ల మద్దతు కోసం చలిమెడ వర్గం పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేఖంగా ఉన్నవారు మొత్తం కలిసి తిరుగుతున్నారు. పరామర్శలు, శుభాకార్యాలకు హజరౌతున్నారు. విందు రాజకీయాలు షురు అయ్యాయి. చలిమెడ సైతం బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగకుండా చాకచాక్యంగా వ్యవహరిస్తూ.. అన అనుచర వర్గాన్ని మండల లీడర్ల వద్దకు పంపిస్తూ ఫోన్లు మాట్లాడుతున్నాడు. అందరికి టచ్ లో ఉంటున్నాడు.

వేములవాడ బీఆర్ఎస్ లో లుక లుకలు.. క్యాడరంతా అసంతృప్తే..

వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముసలం మొదలైంది. పార్టీలో లుక లుకలు కనిపిస్తున్నాయి. క్యాడరంతా ఎమ్మెల్యేకు నమ్మిన బంటుల్లా..విదేయుల్ల ఉన్న.. కాస్తా దూరం పోతే.. ఎమ్మెల్యేకు వ్యతిరేఖంగానే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే చుట్టు ఉన్న ముగ్గురు నలుగురు తప్పా.. క్యాడరంతా అసంతృప్తేగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇన్నాళ్లు పార్టీకి, ఎమ్మెల్యేకు సేవ చేస్తే మాకు ఏం వచ్చింది.. తాము అప్పుల్లోనే కూరుకుపోయాం ..ఏదైన అపదపడ్డ తమకు సాయం చేయడం అంటూ ఎమ్మెల్యేపై బహిరంగగానే విమర్శలు చేస్తున్నారు. సోంత పార్టీ నేతలనే.. పోలీసులతో నిర్బందాలు చేయించడం.. కేసులు పెట్టడం..జైలుకు పంపడం కూడా ఎమ్మెల్యే రమేశ్బాబుకు కాస్తా చెడ్డ పేరు తెచ్చిందని చెప్పాలి.

ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం..గంటల తరబడి నిరక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని పలువురు బీఆర్ఎస్ నేతలు వాపోయారు. మండలాల వారిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేదాలు.. గ్రూపు రాజకీయాలు చక్కదిద్దడంతో కూడా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని మండలాల్లో ఎమ్మెల్యే సభల్లో రాజకీయ విబేధాలతో మైకుల కోసం బహిరంగగానే గొడవలు పెట్టుకుంటున్న సంఘటనలు బహిర్గతమవుతున్నాయి. తెలంగాణా ఉద్యమకారుల పట్ల ఎమ్మెల్యే వైఖరి అవమానకరంగా ఉందని...తమను అసలు మనుషుల్లాగా కూడా చూడడంటూ టీడీపి నుంచి తన పాత క్యాడర్ తోనే బాగుంటడాని వాపోయారు.

రమేశ్బాబుకు నమ్మిన బంటు గా ఉన్న జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ భర్త రాఘవ రెడ్డి ని కూడా దూరం చేసుకున్నడంటే.. వేములవాడ రాజకీయాలు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయో ఇట్టే అర్థమవుతున్నాయంటూ ఓ సీనియర్ లీడర్ పేర్కోన్నాడు. ముఖ్య నేతలను ఎమ్మెల్యే దూరం కొట్టడానికి కారణం సిరిసిల్ల లో రాష్ట్ర స్థాయి పదవి వచ్చినవ్యక్తి తరచు ఎమ్మెల్యే రమేశ్ బాబుకు జర్మనిలో ఉండగా వాట్సప్ ద్వారి లేనిపోని ఆరోపణలు.. నియోజవకర్గం మొత్తం వాళ్లే ఎమ్మెల్యేలాగా తిరుగుతున్నారు.. వీరిని అదుపులో పెట్టుకోపోతే కష్టం అంటూ .. చాడిలు చెబుతూ చాలా మంది లీడర్లను దూరం చేశాడంటూ కోనరావుపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ముద్రకు తెలిపారు. ఏది ఏమైన..రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత చెలిమెడ లక్ష్మీనరసింహరావు అడుగుపెట్టడంతో అలజడి మొదలైందని పేర్కొనాలి. బీఆర్ఎస్ టికెట్ చెలిమెడక..చెన్నమనేనికా అని పక్కన పెడితే.. ఎమ్మెల్యే రమేశ్ బాబు మార్పు కోసం వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ లీడర్, క్యాడర్ మొత్తం కోరుకుంటుంది.