సీనియర్ సిటిజన్లు సమాజ మార్గదర్శకులు - జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

సీనియర్ సిటిజన్లు సమాజ మార్గదర్శకులు - జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  సీనియర్ సిటిజన్స్, పెన్షనర్లు  సమాజ మార్గదర్శకులని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.  ఆదివారం  జడ్పీ  క్యాంప్  కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్  సిటిజన్స్,పెన్షనర్స్  అస్సోసియేషన్స్  జిల్లా శాఖల అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్  ఆధ్వర్యంలో  జడ్పీ  చైర్ పర్సన్ దావ వసంత సురేష్  జడ్పీ చైర్ పర్సన్ గా నాలుగేళ్ళ  పదవీకాలం పూర్తి చేసిన సందర్భంగా ఆమె  జిల్లాలో, చేసిన ప్రజా సేవలను, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు  వివరించే అభినందనల మెమోంటోను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ   తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం పై కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేయక పోవడం శోచనీయమన్నారు. ఆసరా పథకం ద్వారా  దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక పెన్షన్ అందిస్తూ,సీనియర్ సిటీజన్స్ కు ఇంకా భరోసా కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇటీవల వృద్ధుల రక్షణ చట్టంలో పలు కీలక సవరణలు చేసిందన్నారు.  జిల్లాలో   సీనియర్ సిటీజన్స్ కు ,పెన్షనర్స్,బీసీ వర్గాలకు సేవలందిస్తున్న జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను, వారి ప్రతినిధుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,  ఉపాధ్యక్షులు ఎం.డి.యాకుబ్, కోశాధికారి వి.ప్రకాశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,మానాల కిషన్, పెన్షనర్స్  కార్యదర్శి బొల్లంవిజయ్, మహిళా కార్యదర్శి కరుణ, టీ బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,  మెట్ పల్లి డివిజన్  సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు  ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, ఉపాధ్యక్షుడు సైఫోద్దిన్ కోశాధికారి ఎన్.లక్ష్మీనారాయణ, జిల్లా,డివిజన్,మండలాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.