బిజెపిని విమర్శించే నైతికత బిఆర్ ఎస్ కు లేదు

బిజెపిని విమర్శించే నైతికత బిఆర్ ఎస్ కు లేదు
  • రైతుల పక్షపాతి బిజెపి ప్రభుత్వం..
  • పసుపు బోర్డుకి కృతజ్ఞత తెలుపని విజ్ఞత BRS ప్రభుత్వంది
  • బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిజెపిని విమర్శించే నైతికత బిఆర్ ఎస్ కు లేదని బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పట్టణంలో కమల నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలతో పాటు కిసాన్ సమ్మాన్ యోజన కింద 24,632 కోట్ల రూపాయలు రైతులకు సహాయం అందిస్తుందనిన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట కేవలం పదివేల రూపయలు సహాయం అందించి, సబ్సిడీ లను ఎత్తివేసిందనీ గుర్తు చేశారు. ఎంత వరకి ఇది న్యాయమని చిల్లర రాజకీయాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూన్నారని,అర చేతిలో వైకుంఠం చూపెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం రాజకీయం చేస్తూ రైతుల పేరిట మొసలి కన్నీరు కార్చే విధానాన్ని రైతాంగం గమనిస్తుందనీ అన్నారు. పసుపు బోర్డు సాధించిన కృతజ్ఞత తెలుపని బిఆర్ ఎస్  పెద్దల విజ్ఞతకే వదిలేస్తున్నాం.. రైతుల కళ్ళల్లో ఆనందం సంబరాలు మీ ప్రభుత్వ పెద్దలు ఓర్వలేక పోతున్నారని అన్నారు.  షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే, మీకు భూ కబ్జాలు సాధ్యం కాదనే విషయమై రైతుల పొట్టగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, బిజెపి జిల్లా కోశాధికారి సుంకేట దశరథరెడ్డి, జగిత్యాల పట్టణ కిషన్ మోర్చా అధ్యక్షులు ముద్ధం రాము, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిలు సిరికొండ రాజన్న, ఆముదరాజు, జగిత్యాల్ రూరల్ యువ మోర్చా అధ్యక్షులు ఎంపీటీసీ పూదరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రురల్ అధ్యక్షులు  నరసింహారెడ్డి, మరియు రైతు నాయకులు తిరుపతి ,గంగారెడ్డి,రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.