MCR HRDIT  ని సందర్శించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి : ఫ్యాకల్టీ సభ్యుల తో ఇంటరాక్ట్ అయిన ముఖ్యమంత్రి

MCR HRDIT  ని సందర్శించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి : ఫ్యాకల్టీ సభ్యుల తో ఇంటరాక్ట్ అయిన ముఖ్యమంత్రి

హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం MCR HRDIT ని సందర్శించి, ఫాకల్టీ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థ లోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో పాటు  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభిృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి డి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి MCR HRDIT DG  డాక్టర్ శశాంక్ గోయల్ పుస్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా MCR HRDIT DG డా// శశాంక్ గోయల్  ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ADG Benhar Mahesh Duth, CGG DG Rajendra Nimje ,  మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.