కాంగ్రెస్‌ అంటే సంక్షోభం - బీఆర్‌ఎస్‌ అంటే సంక్షేమం

కాంగ్రెస్‌ అంటే సంక్షోభం - బీఆర్‌ఎస్‌ అంటే సంక్షేమం
  • ధరణి తీసేస్తే దళారులదే రాజ్యం
  • ఎన్నికల ప్రచారంలో గంగుల 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాకముందు కరీంనగర్‌లో రోడ్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలని అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు.  మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 56,59,60 డివిజన్ లలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ  పదేళ్లలో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈద్గాల కోసం స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. హిందువుల కోసం టీటీడీ టెంపుల్‌, క్రైస్తవుల కోసం ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని మతాల ప్రజలు కలిసి జీవించే విధంగా కరీంనగర్‌ను కాపాడుతామన్నారు. 

పదేళ్లలో ఎక్కడ మతఘర్షణలకు తావు లేకుండా శాంత్రి భద్రతలకు విఘాతం కలుగకుండా పని చేశామన్నారు. నగరంలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్‌ను గెలిపించు కోవాలని అన్నారు... బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. అసమర్థ ఎంపీ ఉండడం వల్ల కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.

కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల కుట్రలను తిప్పి కొట్టే విధంగా మైనార్టీలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఫ్రీ కరెం ట్‌, మిషన్‌ కాకతీయ, రైతుబీమా తదితర పథకాలు అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి టిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, గందే మాధవి మహేష్ వాల రమణారావు, మాజీ కార్పొరేటర్ సదానంద చారి నాయకులు వంగర రవీందర్, కర్ర సూర్య శేఖర్ తదితరులు ఉన్నారు.