ఎన్నికల వేళ హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్.. గంటకు అద్దె తెలిస్తే షాకే
![ఎన్నికల వేళ హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్.. గంటకు అద్దె తెలిస్తే షాకే](https://mudranews.in/uploads/images/2024/04/image_750x_661bb81ad30e1.jpg)
ముద్ర,తెలంగాణ బ్యూరో:- దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక నాయకులు ప్రచారం కోసం చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో వీటి డిమాండ్ భారీగా పెరిగింది. సింగిల్- ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు సుమారు రూ.1.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు. ట్విన్-ఇంజన్ హెలికాప్టర్లకు దాదాపు రూ.3.5 లక్షలు, చార్టర్డ్ విమానాలకు రూ.5.25 లక్షలు వసూలు చేస్తున్నారు.