జనరల్ బాడీ పట్ల నిర్లక్ష్యం చేయొద్దు...

జనరల్ బాడీ పట్ల నిర్లక్ష్యం చేయొద్దు...

ముద్ర, మల్యాల: జనరల్ బాడీ సమావేశం పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఎంపీడీఓ వెంకటేష్ అధికారులకు సూచించారు. శనివారం ఎంపీపీ విమల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మల్యాల సర్పంచ్ సుదర్శన్ ట్రాన్స్ కో సమస్య ప్రస్తావన తీసుకురాగా, సంబంధిత ఏఈ హాజరు కాలేదు. దాంతో చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరడంతొ ఎంపీడీఓ మాట్లాడుతూ గత సమావేశంలోనే హెచ్చరించినప్పటికి, అధికారులు గైర్హాజర్ కావడం కరెక్ట్ కాదని, మరొకసారి జరిగితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. అలాగే వైద్య, ఐసీడీఎస్ సిబ్బంది కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ సీరియస్ అయ్యారు.

బల్వంతపూర్ గ్రామంలో రహదారి, మురికికాల్వ నిర్మాణంకు 3 కోట్ల నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంతొ ఇబ్బంది అయితుందని సర్పంచ్ రమేష్ సభ ద్రుష్టికి తీసుకురాగా, అది మా పరిధిలో ఉండదని ఎంపీడీఓ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సుదర్శన్ ఓపిక ఉండాలని, ముందు విద్యుత్ స్తంబాలు తొలగించే ప్రక్రియ నడుస్తుందనడంతొ, సమస్య చెప్పుకోవడానికి కూడా వీలు లేదా అంటూ రమేష్ బదులిచ్చాడు. ఉపాధి హామీ సమస్యల పట్ల ముత్యంపేట సర్పంచ్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రావు ప్రశ్నించారు. రోడ్డుకిరువైపులా 16 ఫీట్లు వదిలి మొక్కలు నాటాలని మధుసూదన్ రావు అధికారులను కోరారు. విద్యుత్ సమస్యలు చాల పెండింగ్ లో ఉన్నాయని మల్యాల సర్పంచ్ సుదర్శన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు దాదాపు మెజారిటీగా పాల్గొనగా, సర్పంచులు ఎక్కువ మంది హాజరు కాలేదు.