వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి - జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ 

వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి -  జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రమాదం జరగక ముందే వాగులు వంకలు, చెరువులు బ్రిడ్జ్ ల దగ్గర హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని  జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జడ్పీ చైర్పర్సన్  అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్పర్సన్  మాట్లాడుతూ  జగిత్యాల జిల్లా ప్రజలు,  రైతులు విద్యుత్ స్తంభాలు , తెగిన వైర్లుతో అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు ,లొతట్టు ప్రాంతాలు, వాగులు, ఒర్రెలు, నీటి ప్రవహక ప్రాంతాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎంపిడిఓ లు, రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రంగం మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని,ప్రజలూ అత్య అవసరం ఐతే తప్ప బయటకు రావద్దని,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హెల్త్, శానిటేషన్ విభాగాలు కలిసి పని చేయాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించ్చి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఈ  కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రామానుజాచార్యులు, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ ఎస్ ఈ  సత్య నారాయణ, అశోక్ కుమార్, డిపిఓ దేవరాజం, ఎంపిడివోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.