నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు -ఎస్సై మహమ్మద్ శాఖన్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు -ఎస్సై మహమ్మద్ శాఖన్

 చిట్యాల ముద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో శుక్రవారం సాయంత్రం విత్తనాల షాప్ లలో చిట్యాల ఎస్సై శాఖన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాప్ లో రసీదులేని విత్తనాలను తీసుకోకూడదని రైతులను కోరినారు.

షాపు యజమానులు ప్రభుత్వ అనుమతి కలిగిన విత్తనాలను మాత్రమే షాపులలో అమ్మాలని లేనిచో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు తీసుకున్న ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని రైతు కోరిన విత్తనాలను మాత్రమే రైతులకు అందివ్వాలని అన్నారు. విత్తనాలను బ్లాక్ చేసి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు లైసెన్స్ కలిగిన షాపులలో మాత్రమే విత్తనాలను తీసుకోవాలని కోరారు. విత్తనాలు తీసుకున్న ప్రతి రైతు బిల్లు తప్పకుండా తీసుకోవాలని అన్నారు.