ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి

  • అధికారులకు చిక్కిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు

ముద్ర,తెలంగాణ:- గిరిజన సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఏసీబీకి చిక్కింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.నగదుతో పట్టుబడిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి జగత్ జ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీకి కళ్లు చెదిరేలా నగదు దొరికింది. ఆమె ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు దొరకడంతో ఏసీబీ సిబ్బంది అవాక్కయ్యారు. ఆమె ఇంట్లో ఇంటిలో 66 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. నిందితురాలు రూ. 84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ కె.జగజ్యోతి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనితో అధికారులకు చిక్కిన వెంటనే జగజ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు.

గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తి చేసిన పనికి బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. దీంతో పాటు హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతి గృహం కాంట్రాక్టునూ కూడా ఆయనే దక్కించుకున్నారు.నిజామాబాద్‌లో ఇప్పటికే పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించడానికి ఎస్‌ఈ జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ గంగన్న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు.