పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత: మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్

పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత: మున్సిపల్ ఇంచార్జి చైర్మన్  గోలి శ్రీనివాస్
Municipal in-charge Chairperson Goli Srinivas

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యముతోనే పట్టణమును క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా మార్చడము సాధ్యమౌతుందని మున్సిపల్ ఇంచార్జి చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ అన్నారు . జగిత్యాల పట్టణంలోని నల్లగుట్ట డంప్ యార్డ్ ను సందర్శించిన అయన మాట్లాడుతూ పట్టణములోని ప్రతి ఇంటి వద్ద నుండి వచ్చే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయకపోవడము. దీని వలన వాతావరణము కాలుష్యము ఏర్పడి వ్యాదులు ప్రబలె అవకాశాలు ఉంటాయన్నారు.

డంపింగ్ యార్డులలో  పేరుకపోయిన చెత్తను బయో మైనింగ్ చేయడానికి పనులు కొనసాగుతున్నయని అన్నారు . గృహిణిలు అందరు తప్పకుండా ప్రతి ఇంటి నుండి వెలువడే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మునిసిపల్ వాహనాలకు ఇవ్వడము ద్వారా తడి చెత్తను ఎరువుగాను పొడి చెత్తను రీ సైకిలింగ్ నకు పంపడము ద్వారా డంపింగ్ యార్డుల వద్ద చెత్త అనేది నిల్వ ఉండకుండా ఉంటుందని అందరు సహకరించాలని కోరారు .  రానున్న రోజులలో తడి చెత్తతో ఎరువు తయారు చేసి విక్రయిస్తామని దీని మున్సిపల్ కి  అదనపు ఆదాయం సమకురుతుంధన్నారు. మునిసిపల్ కమిషనర్ బి. నరేష్, వార్డు కౌన్సిలర్లు, బొడ్ల జగదీష్, పంబల రాము, కూతురు రాజేష్, నాయకులు కొండ్ర జగన్, బండారి నరేందర్ ఇంచార్జి సానిటరీ ఇన్స్ పెక్టర్లు అశోక్, రాము, తదితరులు ఉన్నారు.