సైబరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్ మాఫియాలో కొత్తకోణం

సైబరాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్ మాఫియాలో కొత్తకోణం
  • డ్రగ్స్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం
  • హీరోలు, హీరోయిన్ల కు డ్రగ్స్ సరఫరా పై పోలీసుల విచారణ

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :-తెలంగాణ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని గుర్తించిన నైజీరియన్ ముఠా,  కొద్దిరోజుల పాటు హైదరాబాదుకు డ్రగ్స్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కబాలి సినిమా చెందిన  కె పి  చౌదరి అరెస్టుతో రూట్ డ్రగ్ మాఫియా రూట్ మార్చినట్లు తేలుస్తోంది.కేపీ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత నలుగురు యువ హీరోలతో పాటు మరికొద్ది కొత్తగా వచ్చిన హీరోయిన్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు  గుర్తించి వాళ్ల వివరాలు సేకరిస్తున్న  నేపద్యంలో డ్రగ్ మాఫియా  అలర్ట్ గా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది.

నైజీరియన్లు వారి దేశంలో ఉంటూనే తెలుగు రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులను టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ సప్లై చేస్తునట్లు తేలుస్తోంది. గోవాలో మహిళల వద్ద కొంత మొత్తంలో డ్రగ్స్ ఉంచి పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా డ్రగ్ ముఠాలు వ్యవహరిస్తునట్లు తెల్సింది.గతంలో డ్రగ్స్ వాడిన వారి వివరాలు తో ప్రస్తుతం దొరికిన వారి వివరాలను పోలీసులు సరిపోలుతున్నారు. తాజాగా పట్టుబడిన వారిలో కొత్త వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తి చేస్తున్నారు.