కాంగ్రెస్, బిజెపిలకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు

కాంగ్రెస్, బిజెపిలకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు
  • రాజస్థాన్,ఛత్తీస్ గఢ్ లతో  పాటు తెలంగాణలో  కాంగ్రెస్ బాగానే ఉంది అన్న రాహుల్ వ్యాఖ్యలపై ఎద్దేవా
  •  కాంగ్రెస్ నాయకుల బలహీనతల వల్లే దేశంలో మోడీ పాలన  దిక్కయింది
  •  వారం రోజుల్లో  సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తాం
  •  మహిళా బిల్లు ఓటింగ్ లో కాంగ్రెస్ ఎంపీలు హాజరు కాకపోవడం సిగ్గుచేటు
  •  నల్లగొండ జిల్లాను కాంగ్రెస్ హయాంలో నాశనం చేసిర్రు తొమ్మిదేళ్లుగా జాడ లేకుండా పోయిన నాయకులు ఎన్నికల కోసం తిరుగుతుర్రు
  •  నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తాం
  •  దేశానికి సీఎం కేసీఆర్ నేడు రోల్ మోడల్ గా నిలిచారు
  •  సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ కొడుతున్నారు బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసి పంపింది సీఎం కేసీఆర్ 
  •  కాంగ్రెస్ టికెట్లు ప్రకటిస్తే అంగీలు చింపుకొని తన్నుకుంటారు*
  • ఉత్తంకుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ప్రతి ఏడాది రెండు పంటలకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ది
  • కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లు ఎద్దేవా

ముద్ర, కోదాడ : సాగర్ ఎడమ కాలువ ఆయికట్టుకు త్వరలో ప్రభుత్వం నీరు విడుదల  చేస్తుందని రైతులు ఆందోళన గురి కావద్దని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్  అన్నారు.  కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు బిజెపి పార్టీ తగదులేని పార్టీ అని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దింపుడు కల్లానికి వచ్చిందని విమర్శించారు . తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంలో కనిపించని నాయకులు నిన్న మొన్న రైతులు గుర్తుకొచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు నీరు మునగాల, మోతే మండలాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ప్రాజెక్టుల పేరుతో  ఉత్తంకుమార్ రెడ్డి లక్షల రూపాయలు కమిషన్లు తిన్నారని విమర్శించారు ఆయన హయాంలో కట్టిన మాధవరం సింగవరం ప్రాజెక్టు శాంతినగర్ ప్రాజెక్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలారం, శాంతినగర్, గొంద్రియాల  చెక్ డ్యాములు ఏర్పాటుచేసి చివరి భూములకు నీరు అందిస్తున్నామన్నారు రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే సూచనలు ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎద్దేవ చేశారు కాంగ్రెస్ నాయకుల బలహీనత వల్లే దేశం లో మోడీ పాలన దిక్కు అయింది అన్నారు.

పార్లమెంటులో 33 శాతం మహిళా బిల్లు ఆమోదంలో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  హాజరు కాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ ఎంపీలు మహిళా బిల్లు ఆమోదంలో పాల్గొన్నారు బీసీ కులగణన కోసం అసెంబ్లీలో ఆమోదించి తీర్మానాన్ని ఏనాడో కేంద్రానికి పంపారన్నారు నల్గొండ జిల్లాను కాంగ్రెస్ నాయకులు సర్వనాశనం చేశారని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వేలకోట్ల రూపాయల బడ్జెట్ జిల్లాకు కేటాయించి మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశానికి రోల్ మోడల్ గా ఉన్నారని కెసిఆర్ సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల పార్టీలు మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నాయన్నారు కరోనా సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎటుపోయారని , కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో నల్గొండ  జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి భారీ మెజార్టీతో అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నాయకులు అజయ్ కుమార్, చందు నాగేశ్వరరావు,  ఈదుల కృష్ణయ్య,  ఇమ్రాన్ ఖాన్, రషీద్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు