దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు 

దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు 
  • అధికారంలోకి వచ్చాక మూతపడిన చక్కర ఫ్యాక్టరీలను పునః ప్రారంభిస్తాం..
  • దేశం కోసం సైనికుడిలా కాపలా గా ఉంటాం 
  • నాకు ఇళ్లు లేదు..దేశమే నా ఇళ్లు.. దేశంలోని ప్రతి నిరుపేద ఇల్లు నాదే..
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేపడతాం..
  • జగిత్యాల కార్నర్ మీటింగ్ లో ఎ ఐ సి సీ కార్యదర్శి రాహుల్ గాంధీ
  • జగిత్యాల లో రాహుల్ గాంధీ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ఘన స్వాగతం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈ ఎన్నికలు దొరల తెలంగాణ ఒకవైపు.. ప్రజా తెలంగాణ ఒక వైపు జరుగుతున్న ఎన్నికలని ఎ ఐ సి సీ కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల పట్టణంలోని కొత్తబస్తాండ్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధి మాట్లాడుతూ ప్రజా తెలంగాణ కోరుకుంటే నియత్రంత్వ దొరల పాలన తెలంగాణ లో సాగుతుందని, ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది అని భావిస్తే.. దొరల తెలంగాణ వచ్చిందని అన్నారు. భూ కబ్జాలు..మద్యం మాఫియా..ఒక కుటుంబం జేబుల్లోకి పోతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి వర్గాల కోసం..దొరల కోసం ఇవ్వలేదు.. సామాజిక తెలంగాణ కోసం ఇచ్చామని, సామాజిక నిర్మాణం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీఆర్ ఎస్ చక్కెర కర్మాగారం మూసివేసింది... కాంగ్రెస్ అధికారం లోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు పునః ప్రారంభిస్తామన్నారు. పసుపు పై ప్రతి క్వింటాల్ పై 12000 నుండి 15000 మద్దతు ధర చెల్లిస్తాం. వరి ధాన్యం పై ప్రతి క్వింటాల్ పై మద్దతు ధర పై అదనంగా రు.500 ఇస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో దశాబ్దాల తరబడి అనుభందం ఉందని, జవహర్లాల్ నెహ్రూ,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నుండి అనుభందం ఉందని అన్నారు. బీజేపీ, బీ ఆర్ ఎస్, ఎం ఐ ఎం ఓకే కూటమని, చీకటి ఒప్పందం తో పని చేస్తాయనిమ, మోడీ బిల్లు లకు బీ అర్ ఎస్ సపోర్ట్ చేస్తుందని అన్నారు.

మత తత్వ రాజకీయ పార్టీ తో పోరాటం చేస్తున్న.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి ఇంట్లో నుండి వెళ్ళ గొట్టారు.. నాకు ఇళ్లు అవరసం లేదు.. దేశమే నా ఇల్లు... తెలంగాణలోని ప్రతి నిరుపేద ఇల్లు నాదే అని అన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఎం ఐ ఎం బిజెపి కి సపోర్ట్ గా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడమే బిజెపి, ఏం ఐ ఎం లక్ష్యమని అన్నారు. సీఎం కెసిఆర్ బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్ కూడా చొరవ చూపడం లేదు. బలహీన వర్గాల జనాబా వెలికి రావటం మోడీకి, కెసిఆర్ కు ఇష్టం లేదు.. భారత దేశాన్ని అగ్రవర్ణాలకు చెందిన 90 శాతం ఐ ఎ ఎస్ లు పాలిస్తున్నారని అన్నారు. ఎందుకు కుల గణన చేయించడం లేదు.. ఐ ఎ ఎస్ అధికారుల్లో బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారు..ప్రజల ఆలోచించండి. వాస్తవాన్ని గ్రహించండని అన్నారు. కేవలం 5 శాతం బడ్జెట్ మాత్రమే కేటాయిస్తున్నారు.. దేశంలో ఐదు శాతమే ఓ బీసీ లు వున్నారా..అని ప్రశ్నించారు. 50 శాతం బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. సామాన్యుల హక్కులు, డబ్బులు అదాని బ్యాంక్ లోకి పోతున్నాయని అన్నారు. కుల గణన చేయడానికి మోడీ అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బలహీన వర్గాల గణన చేపడుతాం.. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల కుల గణన చేపట్టి జనాబా మేరకు హక్కులు కల్పిస్తామన్నారు. కుల గణన తో ఎక్కడ మోసం జరుగుతుందో తెలుస్తుందని, తెలంగాణ ప్రజల స్వప్నం నిజం చేసేందుకు, ముందుగా కుల గణన చేపడతామన్నారు.

బిఆర్ ఎస్ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడాలని, తెలంగాణ పోరాట యోధులు భాగస్వాములు చేసి ప్రజల తెలంగాణ తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరా గాంధీ..రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ..రాహుల్ గాంధీ సైనికుడిగా దేశం కోసం  సైనికుల్లా కాపలాగా ఉన్నాం. మీకు ఎప్పుడు ఏ ఆపద ఏర్పడినా మీ ముందు నిలబడుతా అన్నారు.  జీవన్ రెడ్డిని శాసన సభకు పంపండి..జీవన్ రెడ్డి ఆత్మ ప్రజలతో ముడిపడి ఉంది. అడ్లురీ లక్ష్మణ్ కుమార్ ను గెలిపించండి...అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. అంతకు ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రచారం కాంగ్రెస్ విజయానికి ప్రతీక అని నాలుగు దశాబ్దాల నుండి గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉన్నాఅన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు జగిత్యాల నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, ఉత్తమకుమార్, బట్టి విక్రమార్క, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వేకంట్ రెడ్డిలు పాల్గొన్నారు.