ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

జనగామ టౌన్, ముద్ర : యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు యాట క్రాంతి కుమార్ యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. యువ నాయకులతో కూడిన అతి పురాతన సంస్థ యూత్ కాంగ్రెస్ అని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పోరాటం చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసం పల్లి లింగాజీ, పట్టణ కాంగ్రెస్  అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏం.డి మాజీద్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సౌడ మహేష్, చేర్యాల పట్టణ అధ్యక్షులు బుడిగే రమేష్ గౌడ్, గుడెపు మహేష్, ప్రవీణ్, బాల్నే నరేష్, అజామ్, పులిగిల్ల శివ, కాసాని విజయ్ తదితరులు పాల్గొన్నారు.