ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కునేందుకురాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుంది

ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కునేందుకురాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుంది

జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

ముద్ర, రాయికల్ : రాయికల్ మండలం చర్ల కొండాపూర్, ఇటిక్యాల,మూటపెల్లి,కొత్తపేట్, ఒడ్డేర కాలనీ గ్రామాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువు కట్టలు, ఇండ్లు, రోడ్లను జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పరిశీలించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ నష్టం జరిగినా రోడ్లు మరియు చెరువు కట్టల విలువ అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదికపంపాలని తెగిపోయిన చెరువులు, గండి పడ్డ కల్వర్టు లనువెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేయించాలని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలని వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని అన్నారు. చైర్ పర్సన్ వెంట గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా . చంద్రశేఖర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ మరంపెల్లి రాణి సాయి పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ సర్పంచ్ లు సామల్లలావణ్య వేణు, రాజేశం,తిరుపతి,నర్సయ్య, చంద్ర శేఖర్ నాయకులు సురేందర్, అనిల్ ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు రైతులు తదితరులున్నారు.