పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత..

పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత..

ముద్ర, వెంకటాపురం (నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని పాలెం వాగు ప్రాజెక్ట్ కు నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నిండు కుండ ను తలపిస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టులోని నాలుగు గేట్లను గురువారం ఎత్తివేసి, వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 125.000 ఎఫ్ఆర్ఎల్.